KURTA

Kakatiya University Retired Teachers Association (KURTA)

Kakatiya University, Warangal, Telangana State, India 506009

అద్వితీయం భారతం GSR

By Prof. G. Srinivasa Reddy on 01 Feb 2026


*అద్వితీయం భారతం* GSR
అద్వితీయం భారతం అనితరం సమ భారతం. అద్వితీయం అనితరం అతులితం మనభారతం.
అనుపమం మన భారతం అమేయం మన భారతం. అనుపమం అమేయం అమోగం మన భారతం.
సుధీర్ఘ చరితం భారతం వైవిధ్య భరితం భారతం. సుధీర్ఘ చరితం వైవిధ్య భరితం ఆనంద స్పురితం భారతం.
ఆయుర్వేదం భారతం యోగ సిద్ధ వైధ్యం భారతం. అమూ ల్యమౌ ప్రకృతి వైద్య భాండాగారమే మన భారతం.
వికాసశీలం భారతం యశోవిశాలం భారతం. వికాసశీల యశోవిశాల మహాలయం మన భారతం.
సర్వధర్మ‌ సమబావం భారతం సర్వమత సారం భారతం. సమరసతా భావసార విచార ధారయే మన భారతం.
లౌకికత్వం భారతం మత రాజ్య త్యజితం భారతం. లౌకికత అతి పూజ్యమని సందేశ మిచ్చే భారతం.
సప్తర్ణం భారతం సకల జాతుల సమూహారం భారతం.
చతుర్వేదం భారతం చతుర్మతాల జనని భారతం. చతుర్వేద చతుర్మత సర్వ హిత సందేశమే భారతం.
విభిన్న భాషల భారతం వైవిధ్యతావృత భారతం. విభిన్న భాషల భిన్న సంస్కృతుల కన్న దేశం భారతం.
రామాయణం భారతం మహాభారతం భారతం. వాల్మీకి వ్యాస కాళిదాసాది నిమ్నకుల మహా కవుల సారస్వతం మన భారతం.
స్వతంత్ర తత్రం భారతం లౌకికత్వం భారతం.స్వతంత్ర తంత్ర లౌకికత్వ సౌభ్రాతృత్వ తత్వం భారతం.
భిన్నతలో ఏకత భారతం వైవిధ్యతా నైవేధ్యం భారతం. బహుళతే మనభారతం ఏక రూపత అభారతం.
అద్వితీయం భారతం అనితరం మన భారతం. సుమనందన సమ భారతం నమో నమః మన భారతం.