KURTA Administrator
Is EHS useful? Should we not ask for option to join or stay away?
ద్యోగి జీతం ఖాతాలో పడిందో లేదో.. ఈహెచ్ఎస్ రికవరీ మాత్రం ముందే జరిగిపోద్ది.! 'నీ ఆరోగ్యం మా బాధ్యత ' అన్నట్టు డబ్బులు లాగేసుకుంటున్నది ఈ ప్రభుత్వం. కానీ ఆ ఉద్యోగి ఇంట్ల నిజంగానే ఆపదొస్తే.. చేతిలో ఈహెచ్ఎస్ కార్డు పట్టుకుని దవాఖాన గడప తొక్కితే 'ఈ కార్డు మా దగ్గర పనికిరాదు ' అంటున్నారు.
కరీమాబాద్ ఉపాధ్యా యుడు భిక్షపతి కొడుక్కు విద్యుత్తు ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్స కోసం దవాఖానకు పోయిండ్రు. ఈహెచ్ఎస్ కార్డు పని చేయకపోవడంతో సొంత డబ్బులు, తోటి టీచర్ల సాయంతో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇది కేవలం ఓ కుటుంబ కష్టం కాదు.. నెలనెలా డబ్బులు రికవరీ చేసుకుంటున్న వేలాది ఉద్యోగుల గుండెల్లో ఉన్న భయం.! అభద్రత.! ప్రైవేట్ దవాఖానాలకు బకాయిలుంటే ప్రభుత్వం తీర్చాలె. ప్యాకేజీలు గిట్టకపోతే పరిష్కారం చూపాలె. కానీ ఆ భారం మాత్రం ఉద్యోగి నెత్తిమీద ఎందుకు.? అందుకే ఈహెచ్ఎస్ మీద నమ్మకం లేక 'స్కీమ్ కావాలా? వద్దా?' అనే ఆప్షన్ ఉద్యోగులకే ఉండాలనే డిమాండ్ ఉద్యోగుల వైపు నుంచి రోజురోజుకూ పెరుగుతున్నది. ఉద్యోగి అడిగేది ఉచిత వైద్యం కాదు.. తాను కట్టిన డబ్బుకు ఆపదలో అండ మాత్రమే.!
Comments & Responses
Comments approved by KURTA will appear here.
KURTA members can read the topic and share their comments or responses after logging in.
Member Login